బీజింగ్: కరోనా.. కరోనా.. ఒకప్పుడు సార్స్, మెర్స్ లాగా... ఇప్పుడీ కొత్త వ్యాధిపై ప్రజలు, ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయి. ఎందుకంటే ఆ వ్యాధి అలా భయపెడుతోంది మరి. చైనాలో మొదలై, జపాన్, అమెరికా, సౌదీ అరేబియా ఇలా కొన్ని దేశాల్లో ఈ వ్యాధి సోకిన కేసులు బయటపడుతుంటే.. ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారం వరకు చైనాలో ఈ వైరస్ సోకి 25మంది మృతి చెందారు. మరో 830 మందికి వైరస్ సోకినట్లు శుక్రవారం చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా వుహాన్‌లో వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు హెల్త్ కమిషన్ చెప్పింది. చైనా, థాయ్‌లాండ్, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. (కరోనా బారిన కేరళ నర్స్)
కరోనా వైరస్ గుప్పిట్లో చైనా..!