మక్కువ: శంబర గ్రామం ఉత్సవ శోభ సంతరించుకుంది. ఏ ఇల్లు చూసినా జాతర సందడితో కళకళలాడుతోంది. పోలమాంబ అమ్మవారి ఆల య పరిసరాల్లో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఉత్సవానికి సూచికగా సోమవారం తొలేళ్ల సంబరం మొదలవుతుంది. మంగళవారం సిరిమానోత్సవం జరగనుంది. ఈ జాతరకు ఇతర జిల్లాలతోపాటు, ఒడిశా, చత్తిస్‌గఢ్ రాష్ట్రాలతోపాటు, జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందు కు వచ్చే అవకాశముంది. జాతరకు వచ్చే భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓఎస్‌డీ రామ్మోహన్, బొబ్బిలి ఏఎస్పీ గౌతమిశాలీ, సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్ పర్యవేక్షణలో జాతర ఏర్పాట్లు వేగవంతంగా జరిపించారు. సోమవా రం తెల్లవారుజాము నుంచి వేలాది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులుతీరేఅవకాశమున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో బి.ఎల్.నగేష్ ఆధ్వర్యంలో జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం ఎంపీడీవో సీహెచ్.సూర్యనా రాయణ, తహసీల్దార్ డి.వీరభద్రరరావు, దేవ దాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ జె.వినోధ్‌కుమార్, పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్ జా న్‌సుందరం జాతర ఏర్పాట్లు పరిశీలించారు.
శంబరకు జాతర శోభ